కబాలి ఫస్ట్ వీక్ కలక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ స్టామినాను కబాలి చిత్రం మరో సారి నిరూపించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచమంతటా గత శుక్రవారం విడుదలై రికార్డ్ సృష్టిస్తోంది. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్ తో రన్ అవుతూ కనక వర్షం కురిపిస్తోంది. రజనీ డాన్ గా మరోసారి నటించిన కబాలి చిత్రానికి తొలుత మిశ్రమ స్పందన వచ్చింది.

అభిమానుల అంచనాలకు చేరుకోలేక పోయిందని కొందరు విమర్శించారు. అయినా వాటన్నిటికీ కలక్షన్స్ సమాధానం చెబుతోంది. 70 కోట్లతో ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ చేసి రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పుడు వారంలో 330 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ సౌత్ ఇండియన్ ఫిలిం ఈ మార్క్ ని అందుకోలేదు. తొలి సారిగా ఆ మైలు రాయిని రజనీ దాటి చూపించారు.

దేశీయంగా ఈ సినిమా 170 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో 160 కోట్లు రాబట్టింది. విదేశాల్లోనూ రజనీకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నట్లు ఈ కలక్షన్లు తెలుపుతున్నాయి. త్వరలోనే కబాలి 400 కోట్ల క్లబ్లో చేరుతుందని నిర్మాత ఎస్.థాను చెప్పారు. తమ బ్యానర్లో  దర్శకుడు పా. రంజిత్ తో మరో సినిమా చేసే ఆలోచన ఉందని వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus