Kabir Duhan Singh: వైరల్ అవుతున్న కబీర్ దోహన్ సింగ్ పెళ్లి ఫోటోలు!

  • June 26, 2023 / 05:18 PM IST

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన జిల్ చిత్రంలో విలన్ గుర్తున్నాడా.. ఆయన పేరు కబీర్ దుహన్ సింగ్. ఆ సినిమాతో విలన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టైలిష్ విలన్ గా పాపులర్ అయ్యాడు. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కబీర్ దుహన్ సింగ్ ఇటీవలే ఓ ఇంటివాడైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆయన సీమా చాహల్ ను పెళ్లి చేసుకున్నాడు. దుహన్ సింగ్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే వీరి వివాహం ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పుట్టి పెరిగిన కబీర్ దోహన్ సింగ్ చాలా ఫ్యాషన్ షోలలో మోడల్‌గా కనిపించాడు. జిల్ సినిమాతో తొలిసారి విలన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. జిల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని.. తన లుక్స్ తో అందరినీ పిచ్చెక్కించేలా చేశాడు.

పలు చిత్రాల్లో నటించిన (Kabir Duhan Singh) కబీర్ ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనకు విషెష్ చెబుతున్నారు. కబీర్ సింగ్ తన పెళ్లిని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కబీర్ భార్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus