ఘనంగా కాదంబరి కిరణ్ కుమార్తె పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

నటుడు కాదంబరి కిరణ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన 290 కి పైగా చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై కూడా పలు షోలు, సీరియల్స్ చేసి క్రేజ్ ను సంపాదించుకున్నారాయన. ‘మనం సైతం’ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాదంబరి.మా(‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’) సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో కాదంబరి..

‘రాజ రాజ చోర’ ‘థాంక్యూ బ్రదర్’ ‘నారప్ప’ ‘భీమ్లా నాయక్’ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ‘లక్కీ లక్ష్మణ్’ వంటి సినిమాల్లో కనిపించారు. ఇదిలా ఉండగా..ఈరోజు కాదంబరి కిరణ్ కూతురు డా.పూర్ణ సాయి శ్రీ వివాహం సాయి భార్గవ్ అనే అబ్బాయితో ఘనంగా జరిగింది. హైదరాబాద్, “తారామతి బారాదరి”లో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్, హీరో శ్రీకాంత్,మురళి మోహన్, కోట శ్రీనివాసరావు,

రామజోగయ్య శాస్త్రి, తనికెళ్ల భరణి, భాస్కరభట్ల, సాయికుమార్, రఘుబాబు, రాకెట్ రాఘవ, బెనర్జీ, అలి, సుబ్బరాయశర్మ, అశోక్ కుమార్, వినోద్ బాల, రజిత, రచ్చ రవి, సన… దర్శకులు రేలంగి నరసింహారావు, అల్లాణి శ్రీధర్, నాగు గవర, ప్రేమరాజ్… నిర్మాతలు బండ్ల గణేష్, అశోక్ కుమార్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సింగర్స్ విజయలక్ష్మి, కౌసల్య, కొమర వెంకటేష్, మోహన్ గౌడ్, పీవీఎస్ వర్మ, వంటి వారు హాజరయ్యారు. ఇక కాదంబరి కిరణ్ కుమార్తె పెళ్లి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus