కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ఒకానొక టైంలో కార్తీ (Karthi) చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు కార్తీ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. అలాంటి టైంలో నాగార్జునతో (Nagarjuna) ‘ఊపిరి’ (Oopiri) అనే సినిమా చేశాడు. అది బాగానే ఆడింది. ఎక్కువగా కార్తీ నటనకి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ సినిమా వల్ల తెలుగు ఆడియన్స్ కి కార్తీ మళ్ళీ దగ్గరయ్యాడు. అటు తర్వాత అతను చేసిన ‘ఖైదీ’ (Kaithi) సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్. (S. R. Prakashbabu) ప్రభు (S R Prabu) నిర్మించిన ఆ చిత్రానికి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ విడుదల చేశారు. 2019 అక్టోబర్ 25న విడుదలైంది. నేటితో ఈ సినిమా విడుదలై 5 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.22 cr |
సీడెడ్ | 0.92 cr |
ఉత్తరాంధ్ర | 1.25 cr |
ఈస్ట్ | 0.52 cr |
వెస్ట్ | 0.42 cr |
కృష్ణా | 0.80 cr |
గుంటూరు | 0.70 cr |
నెల్లూరు | 0.32 cr |
ఏపీ + తెలంగాణ | 7.15 cr |
‘ఖైదీ’ (Kaithi) 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.7.15 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బయ్యర్స్ కి ఈ సినిమా రూ.3.15 కోట్ల లాభాలు అందించింది. ఇక ‘ఖైదీ’ కి సీక్వెల్ గా ‘ఖైదీ 2’ కూడా రానుంది అని ఎప్పుడో ప్రకటించారు. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.