నయనతారను ఫాలో అవుతున్న కాజల్!
- April 25, 2016 / 09:19 AM ISTByFilmy Focus
కథానాయికగా వచ్చే ఏడాది పదేళ్ల కెరీర్ ను పూర్తి చేసుకోబోతున్న క్రేజీ గర్ల్ కాజల్.. ప్రస్తుతం వరుసగా అగ్ర కథానాయకులతో నటిస్తూ యమస్పీడుతో దూసుకుపోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్ త్వరలో రాణా, సందీప్ కిషన్ వంటి యువ కథానాయకులతో సైతం జతకట్టేందుకు సన్నద్ధమవుతోంది.
చూస్తుంటే కాజల్ తన సీనియర్ అయిన నయనతారను ఫాలో అవుతున్నట్లుంది. నయనతార సైతం తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. తమిళంలో శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది. వీరిద్దరినీ ఆదర్శంగా తీసుకొని.. మరింత మంది కథానాయికలు కూడా ఇలా సీనియర్ మరియు జూనియర్ హీరోలతో జతకడుతూ తమ కెరీర్ లను ప్లాన్ చేసుకొంటున్నారో చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














