Kajal Aggarwal: ఎక్కువగా వాటిపైనే ఫోకస్ పెట్టిన కాజల్?

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గత దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్రతారగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్ గా గుర్తింపు పొందారు.ఎంతో మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ కాజల్ ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలను అందుకొని నటిస్తున్నారు. ఇక 2020 వ సంవత్సరంలో కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ ను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈమె వివాహం చేసుకున్నప్పటికీ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కాజల్ తల్లి కాబోతున్నారా అనే విషయం తెలియగానే తాను కమిట్ అయిన సినిమాల నుంచి పూర్తిగా తప్పుకొనీ మధురమైన క్షణాలను ఎంతో ఆస్వాదిస్తూ పూర్తిగా తన జీవితాన్ని ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఈ క్రమంలోనే తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ అనుభూతులను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఏప్రిల్ 19వ తేదీ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

తన కొడుకుకు నీల్ కిచ్లు అని నామకరణం కూడా చేశారు. ఇకపోతే ప్రస్తుతం తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు. కాజల్ అగర్వాల్ తన బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈమె తిరిగి సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.ఇప్పటికే తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను సినిమాల్లో నటించడానికి సిద్ధమే అని చెప్పకనే చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు జన్మనిచ్చిన కూడా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

ఇలా వరుస ఫోటో షూట్లతో కాజల్ అగర్వాల్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా కాజల్ అగర్వాల్ మేనేజర్లు తన పాత్రకు అనుగుణంగా ఉండే కథలు వస్తే కాజల్ నటించడానికి సిద్ధంగా ఉందని అవకాశాల కోసం పలు ప్రొడక్షన్ హౌసులు, అదేవిధంగా ప్రముఖ ఓటిటీల చుట్టూ తిరుగుతూ కాజల్అగర్వాల్ కు తగ్గ పాత్రల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ ఎక్కువగా తన దృష్టిని ఓటిటీల పై పెట్టినట్లు తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus