Kajal, Anushka: ”పిల్లలు పుట్టిన తరువాత రిప్లై ఇవ్వాల్సింది”

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత తన భర్త గౌతమ్ తో కలిసి హనీమూన్ కి కూడా వెళ్లింది. కొన్నిరోజులు భర్తతో ఎంజాయ్ చేసిన కాజల్.. మెల్లగా సినిమా సెట్స్ పైకి కూడా వచ్చింది. మధ్యలో ఓ బిజినెస్ మొదలుపెట్టింది. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్ల తర్వాత తనకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన ఓ వ్యక్తికి తాజాగా థాంక్స్ చెప్పింది కాజల్.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క. కాజల్ పెళ్లి చేసుకున్న సందర్భంగా.. మరుసటిరోజే అనుష్క ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. పెళ్లికి సంబంధించిన పెద్ద కొటేషన్ పెట్టి మరీ కాజల్ ను విష్ చేసింది. ఆమెని ట్యాగ్ చేస్తూ అనుష్క పెట్టిన పోస్ట్ కి సరిగ్గా ఏడు నెలల తరువాత లవ్ సింబల్స్ తగిలించి కాజల్ స్పందించింది. కాజల్ చేసిన ఈ పనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న కాజల్..

అనుష్కకు రిప్లై ఇవ్వడానికి మరో లాక్ డౌన్ రావాల్సి వచ్చిందంటూ పంచ్ లు వేస్తున్నారు. మరికొందరు పిల్లలు పుట్టిన తరువాత రిప్లై ఇస్తే బాగుండేదని కౌంటర్లు వేస్తున్నారు. నిజానికి సమస్య ఎక్కడ వచ్చిందంటే అనుష్కది వెరిఫైడ్ అకౌంట్ కాదు. బ్లూ టిక్ మార్క్ లేకపోవడంతో కాజల్ పొరబడినట్లుంది. అందుకే కాస్త ఆలస్యంగా స్పందించి ఉంటుంది.


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus