Kajal Aggarwal: వైరల్ అవుతున్న కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలలో కొన్ని సినిమాలు కాజల్ (Kajal Aggarwal) సమంత (Samantha) కాంబినేషన్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్స్ గా నిలిచి నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించడం జరిగింది. మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం అంటూ కాజల్ అగర్వాల్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. నా సినిమా కెరీర్ సాఫీగా సాగడానికి భర్తే కారణమని ఆమె పేర్కొన్నారు.

భర్త సపోర్ట్ తోనే నేను ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని ఆమె వెల్లడించారు. నా సినిమాల ఎంపిక విషయంలో భర్త అస్సలు జోక్యం చేసుకోరని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. అయితే నా భర్త కొన్ని సలహాలు మాత్రం ఇస్తారని ఆమె వెల్లడించడం గమనార్హం. ఖాళీ సమయం దొరికితే గౌతమ్ కిచ్లు తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారని కాజల్ అన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత, రష్మిక (Rashmika Mandanna) , రాశీఖన్నా (Raashi Khanna) అంటే భర్తకు చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.

కాజల్ సత్యభామ (Satyabhama) సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. కాజల్ స్క్రిప్ట్స్, డైరెక్టర్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ పారితోషికం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

పెళ్లి తర్వాత అభినయ ప్రధాన పాత్రలకే ఓటు వేయడం గమనార్హం. కాజల్ అగర్వాల్ ఇతర భాషల్లో సైతం నటించాలని వరుస విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే మాత్రం కాజల్ అగర్వాల్ కు తిరుగుండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus