Kajal Aggarwal: సినిమాల పరంగా అలాంటి కండిషన్స్ పెడుతున్న కాజల్.. కష్టమే అంటున్న ఫ్యాన్స్!

  • August 11, 2023 / 07:21 PM IST

వెండితెర చందమామగా ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీలను అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాజల్ అగర్వాల్ గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇలా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఈమె ప్రెగ్నెంట్ అవ్వడంతో బాబుకు జన్మనిచ్చే వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక బాబు జన్మించిన అనంతరం ఈమె తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు.

కాజల్ అగర్వాల్ ఇదివరకే ఇండియన్ 2సినిమాకు కమిట్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. దీనితోపాటు బాలకృష్ణ హీరోగా నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి అని సినిమా షూటింగ్ పనులలో కూడా ఈమె ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమాతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ అనే సినిమాకు కూడా ఈమె గ్రీజ్ సిగ్నల్ ఇచ్చారని తెలియజేశారు. ఇలా కెరియర్ పరంగా కాజల్ ఎంతో బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఈమె సినిమాల పరంగా తనకి సినీ కెరియర్ పరంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారనీ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా కాజల్ (Kajal Aggarwal) ఇకపై సినిమాలలో నటించాలి అంటే దర్శక నిర్మాతలకు ఒక కండిషన్ పెడుతున్నారట. ఈమె ఇకపై సినిమాలలో ఎలాంటి స్కిన్ షో చేయనని ముందుగానే తెలియజేస్తున్నట్టు సమాచారం. కాజల్ అగర్వాల్ తల్లి అయిన తర్వాత స్కిన్ షో చేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు అందుకు గల కారణం తాను తల్లి అయిన తర్వాత కూడా సినిమాల్లోకి వెళ్లాలి అంటే స్కిన్ షో చేయకుండా సినిమాలు చేయాలని తన భర్త కండిషన్ పెట్టడంతోనే ఈమె కూడా స్కిన్ షో చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని అలాంటి పాత్రలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.

ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు అందుకోవాలని గ్లామర్ షో తప్పనిసరి అయితే కాజల్ అందుకే దూరంగా ఉంటున్నారని తెలియడంతో ఈమెకు హీరోయిన్గా అవకాశాలు రావడం కష్టమే అంటూ పలువురు భావిస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus