లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ .. అనేక మంచి పాత్రలు పోషించి టాలీవుడ్ యువరాణిగా పేరుతెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించి విజయాలను అందుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అ !’ చిత్రం రిలీజ్ అయి అభినందనలు అందుకుంటోంది. ఇందులో మేకప్ లేకుండా సహజంగా నటించి.. విభిన్న పాత్రలను సైతం చక్కగా పోషించగలనని నిరూపించింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె తన ప్రేమ, పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది.
” ప్రేమ, పెళ్లి నా సినిమాలకు ఇబ్బంది అని నేనెప్పుడూ అనుకోలేదు. జీవితంలోకి వాటిని ఎప్పుడూ ఆహ్వానిస్తాను. నా చెల్లెలు నిషా అగర్వాల్ కూడ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడ సరైనవ్యక్తిని సెలక్ట్ చేసుకోమని చెబుతున్నారు” అని వెల్లడించింది. సో ప్రేమ విషయంలో పేరెంట్స్ ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని తెలుస్తోంది. మరి ఏ హ్యాండ్సమ్ ని ప్రేమిస్తుందో చూడాలి.