రోజు రోజుకీ ‘వెబ్ సిరీస్’ లకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. డిజిటల్ మీడియా పార్టనర్స్ అందరూ వీటి వైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. సినిమాలకు కూడా ఈ వెబ్ సిరీస్లు పెద్ద సవాళ్ళు విసురుతున్నాయి. ప్రముఖ నెట్ ఫ్లిక్, అమెజాన్,హాట్ స్టార్ వంటి పాపులర్ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు వేలకు వేల కోట్ల పెట్టుబడి పెట్టి వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు తీయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇక సినిమా టాక్ బాగోకపోతే థియేటర్ కు వెళ్ళడం అవసరమా అని భావించి.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో వచ్చే వెబ్ సిరీస్ లు చూడటం బెటర్ అని ఫిక్సయిపోతున్నారు. ఇక అతి తక్కువ రోజుల్లో పూర్తయిపోయే వెబ్ సిరీస్ లకి ఎక్కువ పారితోషికం అందుతుండడంతో కొంతమంది స్టార్స్ సైతం వీటిలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ లిస్ట్ లో తాజాగా కాజల్ కూడా చేరిపోయింది. అవును త్వరలోనే కాజల్ ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ప్రముఖ ‘హాట్ స్టార్’ సంస్థ ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వెబ్ సిరీస్ లోనే కాజల్ నటించబోతుందట. ఎలాగూ ఈ భామకి పెద్ద అవకాశాలు లేవు. ఈమె చెప్పే రెమ్యూనరేషన్ దెబ్బకు చిన్న సినిమా నిర్మాతలు కూడా బయపడి పారిపోతున్నారు. అందుకే రెండు వైపులా బాగుంటుందని కాజల్ వెబ్ సిరీస్ లను నమ్ముకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో పది ఎపిసోడ్స్ ఉంటాయట. సెప్టెంబర్ నుండీ చిత్రీకరణ మొదలుకాబోతుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.