తేజ (Dharma Teja Jasti) దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ (Lakshmi Kalyanam) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). ఆ తర్వాత ‘పౌరుడు’ (Pourudu) ‘ఆటాడిస్తా’ వంటి సినిమాల్లో చేసింది. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా అంటే ‘చందమామ’ (Chandamama) అనే చెప్పాలి. ఆ సినిమా వల్లే కాజల్ కి ‘మగధీర’ (Magadheera) వంటి పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. అటు తర్వాత ఆమె స్టార్ అయిపోయింది. తక్కువ టైంలోనే మహేష్ బాబు(Mahesh Babu), ఎన్టీఆర్(Jr NTR) , పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రాంచరణ్ (Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun) ,ప్రభాస్ (Prabhas) వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకుంది.
Kajal Aggarwal
తర్వాత యంగ్ హీరోలతో కూడా ఆడిపాడింది. ఇదిలా ఉండగా.. కాజల్ తాజాగా తన కొడుకుతో పాటు ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. ముంబై ఎయిర్పోర్ట్ లో కాజల్ తన కొడుకుతో పాటు కలిసి సందడి చేసింది. కారులో నుండి దిగి ఎయిర్ పోర్ట్ లోపలికి తన కొడుకుతో పాటు ఆమె వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కాజల్ కొడుకు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాడు. దీంతో నెటిజన్లు ‘తల్లి పోలికలు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
భవిష్యత్తులో హీరో అవుతాడు అని కూడా చాలా మంది అంటున్నారు. ఇక కాజల్ బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్ లో కనిపించింది. చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంది. కాజల్ 2020 లో తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్మెన్ అయినటువంటి గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కుమారుడి పేరు నీల్ కిచ్లు.