Kajal: కాజల్ అగర్వాల్ కు ఫేర్వెల్ ఇచ్చిన శ్రీలీల.. ఎమోషనల్ అయినా కాజల్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో పాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె బాలయ్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారని తెలుస్తోంది.

ఇలా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో చిత్ర బృందానికి ఈమె గుడ్ బై చెప్పారు. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో శ్రీ లీల తనకు చిన్న ఫేర్వెల్ ఇచ్చే సర్ప్రైజ్ చేశారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో కాజల్ అగర్వాల్ కు శ్రీ లీలా ఒక స్వీట్ గిఫ్ట్ ఇచ్చారు.

ఈ గిఫ్ట్ కు సంబంధించిన ఫోటోలను (Kajal) కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రత్యేకంగా శ్రీ లీలకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా అందరిని మిస్ అవుతున్నానని త్వరలోనే మనం మరో ప్రాజెక్టు ద్వారా కలవాలి అంటూ ఈమె ఈ సందర్భంగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా బాలయ్య సినిమా పూర్తి చేసుకున్న ఈమె త్వరలోనే మరో సినిమా షూటింగ్లో బిజీ కానున్నారు.

గత కొద్ది రోజుల క్రితం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈమె కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సత్యభామ అనే టైటిల్ పెట్టారు ఈ సినిమా కాజల్ అగర్వాల్ కు 60వ సినిమా కావటం విశేషం. ఇలా లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి తక్కువ సమయంలోనే ఏకంగా 60 సినిమాలలో నటించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus