Kajal: తండ్రి వ‌య‌సున్న హీరోతో డేట్ కి వెళ్తావా ? కాజల్ ను తిట్టిపోస్తున్న నేటిజన్లు

కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందం కాజల్. కృష్ణవంశీ అంతటి అందాన్ని ‘చందమామ’గా చూపించి ప్రేక్షకులకు కనుల విందు చేశారు. ఆ తర్వాత వరుస సినిమాలతో హిట్లు కొట్టి స్టార్ స్టేటస్ అందుకుంది కాజల్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇటీవలే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇటీవలే ఓ కొడుకుకు జన్మనిచ్చింది. ఓవైపు కుటుంబాన్ని మ‌రోవైపు కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది మిత్రవింద.

పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ కూడా ఇవ్వకుండానే ప్రెగ్నెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకు పోతోంది. కాజల్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు మూడు ప్రాజెక్టుల్లో కాజల్ నటిస్తోంది. అన్నీ భారీ ప్రాజెక్టులే. అందులో యువరత్న బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి ఒక‌టి. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరొందిన అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అలాగే శంక‌ర్‌, విశ్వనటుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఇండియ‌న్ 2లో కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

వీటితో పాటు కెరీర్లో మొదటి సారిగా ఫుల్ టైం స‌త్య‌భామ‌ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా చందమామ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ వేదిక‌గాపై కాజ‌ల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటంటే.. టాలీవుడ్ హీరోల‌తో డేట్ కి వెళ్లాల్సి వ‌స్తే ఎవ‌రితో వెళ్తారు..? అనే ప్ర‌శ్న ఆ సందర్భంలో కాజ‌ల్ కు ఎదురైంది.

అందుకు కాజల్ (Kajal) వెంటనే అక్కినేని నాగార్జున‌తో డేట్ కి వెళ్తానని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో కొందరు కాజల్ ను తిట్టిపోస్తున్నారు.టాలీవుడ్ లో ఇంతమంది యంగ్ హీరోలు ఉండగా.. తండ్రి వ‌య‌సున్న హీరోతో డేట్ కి వెళ్తావా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ ఆడిపోసుకుంటున్నారు. గతంలో నాగార్జున ది ఘోస్ట్‌లో మొద‌ట కాజ‌ల్ నే హీరోయిన్ గా ఎంపిక చేశారట.. కానీ అదే సమయంలో తను ప్రెగ్నెంట్ కావడంతో ఆ మూవీని వదులు కోవాల్సి వచ్చిందట. అయితే నాగ్ తన తదుపరి సినిమాకు మాత్రం కచ్చితంగా కాజలే హీరోయిన్ అని కన్ఫర్మ్ అయిందని టాక్.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus