Kajal: అంతా గజిబిజిగా ఉంటుందట.. మాతృత్వం పై కాజల్ స్పందన..!

టాలీవుడ్లో మాత్రమే కాదు మన కాజల్ అగర్వాల్ కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయినే. హీరోయిన్లలో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చింది కాజల్ మాత్రమే అని చెప్పాలి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కాజల్ 2020 అక్టోబర్లో తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్ళైనప్పటికీ ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేయలేదు.

అయితే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. దాంతో కొన్ని సినిమాల్లో కూడా ఈమె ఛాన్స్ లు వదులుకుంది. అందులో నాగార్జున-ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఘోస్ట్’ మూవీ కూడా ఒకటి. పెళ్ళి చేసుకుని ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లకి ఇక సినిమా అవకాశాలు ఏమీ రావు.. కాబట్టి వాళ్ళకి సంపాదన అనేది కూడా ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంటుంది. కానీ కాజల్ మాత్రం తన ఇన్స్టా ద్వారా ప్రెగ్నన్సీ ప్రొడక్ట్స్ వంటి వాటిని ప్రమోట్ చేస్తూ చేతినిండా సంపాదిస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా కాజల్ తన ప్రెగ్నెన్సీ అనుభవాలను షేర్ చేసుకుంది. ‘తల్లి అయ్యే భాగ్యం దక్కడం చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది కానీ.. ఆ సమయంలో మనసంతా గజిబిజిగా ఉంటుంటుంది. అంతా మన కంట్రోల్ లోనే ఉంది అని సంతోషించే లోపే తర్వాత క్షణం ఏం జరగబోతుందో అనే టెన్షన్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఏ టైంలో ఏం చేయాలో, ఏమి చేస్తున్నామో కూడా సమయం గడిచిపోతుంటుంది.

మన పిల్లలను, జీవిత భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు ఈ ఎమోషనల్ బాండింగ్ లో మనల్ని మనం మర్చిపోతుంటాం’ అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. కాజల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇలాంటి విషయాలను షేర్ చేసుకోవడం వలన అవి ఎక్కువ మందికి చేరువవుతున్నాయి. తన బేబీ బంప్ ఫోటోలని కూడా ఈమె తెగ షేర్ చేస్తుంటుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus