రామ్ చరణ్ కి ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత సరైన సక్సెస్ పడలేదు. తండ్రి చిరంజీవితో కలిసి చేసిన ‘ఆచార్య’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. సల్మాన్ ఖాన్ ‘కిసి క భాయ్ కిసి క జాన్’ సినిమాలో కూడా కేమియో ఇచ్చాడు. అది కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సో చరణ్ కి ఇప్పుడు అర్జంటుగా ఓ హిట్టు కావాలి. ప్రస్తుతం అతను బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ చేస్తున్నాడు.
దీని గ్లింప్స్ కానీ ఫస్ట్ సింగిల్ కానీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చరణ్ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ‘పెద్ది’ కి భారీగా బిజినెస్ జరుగుతుంది. 2026 మార్చి నెలలో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన కూడా కీలక పాత్రకి ఎంపికైనట్టు తాజా సమాచారం.

ఆమె పాత్ర ఏంటి అన్నది తెలీలేదు కానీ.. ‘పెద్ది’ లో ఆమె చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. శోభన ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు చేయడం లేదు. కథ బాగుండి తన పాత్రకి ప్రాముఖ్యత ఉంటే తప్ప ఆమె ఏ ఆఫర్ కి ఎస్ చెప్పడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 AD’ లో నటించింది. అది సూపర్ హిట్ సినిమా. తర్వాత మోహన్ లాల్ ‘తుడరుమ్’ లో నటించింది. అది కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఇప్పుడు ‘పెద్ది’ లో ఆమె నటిస్తుంది అంటే.. కచ్చితంగా కథ, ఆమె పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది.
