పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లతో కలిసి ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్..లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉండటంతో.. సినిమాకి మంచి హైప్ ఏర్పడింది.
మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి.వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసింది. 3 వారాలు దాటినా ‘కల్కి..’ కలెక్షన్స్ జోరు తగ్గలేదు. ఒకసారి 23 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 87.31 cr |
సీడెడ్ | 20.48 cr |
ఉత్తరాంధ్ర | 20.62 cr |
ఈస్ట్ | 12.01 cr |
వెస్ట్ | 8.00 cr |
గుంటూరు | 10.87 cr |
కృష్ణా | 10.76 cr |
నెల్లూరు | 5.73 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 175.78 cr |
కర్ణాటక | 33.95 cr |
తమిళనాడు | 20.44 cr |
కేరళ | 11.76 cr |
హిందీ(నార్త్) | 133.80 cr |
ఓవర్సీస్ | 120.67 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 496.40 cr (షేర్) |
‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 23 రోజుల్లో ఈ సినిమా రూ.496.4 కోట్ల షేర్ ను రాబట్టింది.10 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.111.4 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.