కోర్టులో కలుసుకుందాం.. ధన్యకు వార్నింగ్ ఇచ్చిన కల్పిక!

  • December 15, 2022 / 04:37 PM IST

యశోద సినిమాలో నటించడం ద్వారా కల్పికా గణేశ్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న కల్పిక ఒక ఇంటర్వ్యూలో ధన్య బాలకృష్ణ గురించి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. అయితే తాజాగా కల్పిక ధన్య గురించి మరోమారు సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. ధన్య బాలకృష్ణ నన్ను వివాదాల్లోకి ఆహ్వానిస్తోందని కల్పిక అన్నారు. ఆమె గురించి ఎన్నో విషయాలను బయటపెట్టడంతో ధన్య నుంచి వరుసగా కాల్స్ వస్తున్నాయని కల్పిక పేర్కొన్నారు.

కాల్స్ చేసి భయపెట్టాలనుకుంటున్నావా? లేక భయపడ్డావా? అని ఆమె ప్రశ్నించారు. ఏం చేసుకుంటావో చేసుకో అని కల్పిక పేర్కొన్నారు. త్వరలో కోర్టులో కలుసుకుందాం అంటూ కల్పిక ధన్యకు వార్నింగ్ ఇచ్చారు. నాకు క్షమాపణలు వద్దు అలాగే అవకాశాలు కూడా వద్దని కల్పిక వెల్లడించారు. నేను అనుకోకుండా నటిని అయ్యానని ఇది కాకపోతే వేరే పనులు చూసుకుంటానని ఆమె పేర్కొన్నారు. నీ పవర్ చూపించి నేను షేర్ చేసిన వీడియోను యూట్యూబ్ లో లేకుండా చేశావని నా పవర్ చూపిస్తే భస్మమైపోతారు అని కల్పిక అన్నారు.

కల్పిక కామెంట్ల గురించి ధన్య బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సపోర్ట్ తో నా యూట్యూబ్ వీడియోను బ్లాక్ చేయించారని కల్పికా గణేష్ చెప్పుకొచ్చారు. యూట్యూబ్ నిబంధనల ప్రకారం వీడియోను బ్లాక్ చేయాలంటే వీడియో పోస్ట్ చేసిన వ్యక్తికి మెయిల్ పెట్టాల్సి ఉంటుందని కల్పిక కామెంట్లు చేశారు.

నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నా అకౌంట్ నుంచి వీడియోను ఎలా తొలగిస్తారని కల్పిక ప్రశ్నించారు. దీని గురించి నేను మరింత తెలుసుకుంటానని ఆమె పేర్కొన్నారు. కల్పిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్పిక, ధన్య ఒకరి గురించి మరొకరు కామెంట్లు చేసుకుంటూ పరువు పోగొట్టుకుంటున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus