Kalyaan Dhev: మరో ఆసక్తికర పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. శ్రీజ గురించేనా?

మెగా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు తన కుమార్తెకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈయన గత కొంతకాలంగా మెగా డాటర్ శ్రీజకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.శ్రీజకు ఈయన రెండవ భర్త ఆయనకి తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. ఇద్దరికీ ఓ కుమార్తె జన్మించిన తర్వాత మనస్పర్ధలు కారణంగా విడిపోయారని తెలుస్తుంది.

ఇక సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు కనుక చూస్తే ఇద్దరికీ విడాకులు అధికారికంగా వచ్చాయని కానీ ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచేస్తున్నారని మాత్రం అర్థం అవుతుంది.ఇక కళ్యాణ్ దేవ్ కుమార్తె శ్రీజ వద్ద ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తరచు తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నాను అంటూ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేస్తూ జీవితంలో మార్చలేనివి కొన్ని ఉంటాయి. ఆ సమయంలో వాటిని వదులుకొని ధైర్యం చేసినప్పుడే ఆవే మధుర క్షణాలు దీనిని మీరు ఒప్పుకుంటారా అంటూ ఈయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇకపోతే కళ్యాణ్ దేవ్ (Kalyaan Dhev) ఈ పోస్ట్ శ్రీజను ఉద్దేశించి చేశారని అర్థమవుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా తనని మార్చుకోవాలని ప్రయత్నంలో ఈయన విఫలమయ్యారని అందుకే తనని వదులుకున్నారని అర్థం వచ్చేలాగా ఈయన పోస్ట్ చేశారనీ తెలుస్తోంది. ఏది ఏమైనా శ్రీజ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus