విశేషదారణ దక్కించుకుంటున్న కళ్యాణ్ దేవ్, పులి వాసు, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ల ‘సూపర్ మచ్చి’ టీజర్..!

మెగాస్టార్ చిన్నల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ అనతికాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మొదటి సినిమాతోనే ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ దేవ్… ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో పులి వాసు దర్శకత్వంలో అతను చేస్తున్న తాజా చిత్రం ‘సూపర్ మచ్చి’.నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఇదిలా ఉండగా… దీపావళి పండుగను పురస్కరించుకొని తాజాగా ‘సూపర్ మచ్చి’ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  కళ్యాణ్ సరసన రియా చక్రవర్తి, రచిత రామ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.   ఇక తాజాగా విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

ఇక టీజర్ విషయానికి వస్తే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్టు స్పష్టమవుతుంది. యాక్షన్ ఎలిమెంట్స్ కు కూడా డోకా లేదనే స్పష్టత కూడా టీజర్ ద్వారా ఇచ్చారు మేకర్స్. టీజర్ చూస్తుంటే హిట్టు కళ పుష్కలంగా కనిపిస్తుంది.ఆల్రెడీ యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి దూసుకుపోతుంది ‘సూపర్ మచ్చి’ టీజర్. తనికెళ్ల భరణి, ప్రగతి, రాజేంద్ర ప్రసాద్, పోసాని వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus