Kalyaan Dhev: శ్రీజ పై మరోసారి కళ్యాణ్ దేవ్ సెటైర్లు?

మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ అందరికీ సుపరిచితమే. ఆమె సినిమాల్లో నటించింది అంటూ ఏమీ లేదు.కానీ చిరంజీవికి గారాలపట్టి. అందుకే ఆయన అభిమానుల దృష్టి ఈమె పై ఉంటుంది. గతంలో ఈమె అనూహ్యంగా శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పట్లో కుటుంబ సభ్యులకు దూరమైంది. ఆ టైంలో చాలా రచ్చ జరిగింది. ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది. అయితే కారణాలేంటో తెలీదు శ్రీజ .. శిరీష్ తో విడాకులు తీసుకుని తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది.

కొన్నాళ్ళు పాపతో ఒంటరిగా గడిపిన శ్రీజని… కళ్యాణ్ దేవ్ కు ఇచ్చి పెళ్లి చేసారు కుటుంబ సభ్యులు. అతను పెద్ద వ్యాపార రంగానికి చెందిన కుటుంబానికి వారసుడు. శ్రీజ – కళ్యాణ్ చాలా కాలం కలిసే ఉన్నారు. కానీ కొన్నాళ్లుగా వీళ్ళు సెపరేట్ గా ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్ గత సినిమాలని మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేసింది లేదు. ప్రస్తుతం అతని చేతిలో సినిమాలు కూడా లేవు. సో ఇతని సినీ కెరీర్ దాదాపు ముగిసినట్టే.. అని చెప్పాలి.

మరోపక్క ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ – శ్రీజ లు ఒకరినొకరు అన్ ఫాలో కొట్టేసిన సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే రోజున ‘ ఒక మనిషిని ఇష్టపడడం కంటే అతన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామన్నది ముఖ్యమని కళ్యాణ్ దేవ్ ‘ పోస్ట్ పెడితే…’ ఒకరిని ప్రేమించడం అంటే వాళ్లని వాళ్లు అధికంగా ప్రేమించుకునేలా చేయాలి . మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా చేసుకోవాలి. అన్నిటికీ మించి ప్రేమను గుర్తించాలి….’ అంటూ శ్రీజ పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఈ పోస్టులు బట్టి.. కళ్యాణ్ దేవ్ – శ్రీజ విడిపోయారని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఇదిలా ఉండగా..(Kalyaan Dhev) కళ్యాణ్ దేవ్.. మళ్ళీ శ్రీజకి కౌంటర్ ఇచ్చినట్టు ఓ కామెంట్ చేశాడు. ‘ఇతరులు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధల గురించి మనకు తెలిసింది గోరంత అయితే తెలియనది కొండంత ఉంటుంది. అందుకే ఎదుటి వారి పట్ల మనం దయ, జాలి కలిగి ఉండాలి’ అంటూ కామెంట్ చేశాడు అలాగే మరో పోస్ట్ లో… క్రమశిక్షణ వల్ల వచ్చే బాధ, విచారం వల్ల కలిగే బాధ ఇలా అని ఇలా రెండుంటాయి. వాటిలో మీరు ఏది కోరుకుంటారు?’ అంటూ కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus