Krithi Shetty Remuneration: కృతి శెట్టి పారితోషికంపై బంగార్రాజు డైరెక్టర్ కామెంట్!

గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కృతి శెట్టి మొదటి సినిమాతోనే ఏ స్థాయిలో బాక్సాఫీస్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొదటి సినిమా సక్సెస్ అనంతరం ఈ బ్యూటీకి ఆఫర్లు అయితే చాలా గట్టిగానే వస్తున్నాయి. అంతేకాకుండా పారితోషకం స్థాయిని కూడా పెంచేసింది. ఇటీవల నాని తో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీ రేంజ్ కూడా అమాంతం పెరిగి పోయింది.

అంతేకాకుండా గ్లామరస్ రోల్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ సినిమాతో క్లారిటీ వచ్చేసింది.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అగ్ర హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా పారితోషికం అందుకుంటున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం కృతి శెట్టి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బంగార్రాజు సినిమాకు కూడా అదే స్థాయిలో ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ స్థాయిలో ఎందుకిచ్చారు అనే సందేహం చాలా మందిలో కలుగుతూనే ఉంది.

ఎందుకంటే ఉప్పెన సినిమా విడుదల కంటే ముందే దర్శకుడు కథ చెప్పాడట. బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో కృతి శెట్టి కి భారీస్థాయిలో పారితోషికం ఇవ్వడానికి గల కారణాలు చెప్పాడు. నిజానికి ఉప్పెన సినిమా కంటే ముందే ఆమెకు బంగార్రాజు కథ చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఇంకా పారితోషికం గురించి మాట్లాడుకోలేదు. ఎవరికైనా సరే మార్కెట్ ను బట్టి డిమాండ్ ఉంటుంది.

అంతేకాకుండా బంగార్రాజు సినిమా లో నాగలక్ష్మి అనే పాత్రకు కరెక్టుగా సరిపోతుంది అనిపించింది. అందుకే ఆమె రేంజ్ కు తగ్గట్లుగానే పారితోషకం ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ ఉప్పెన సినిమాకంటే ముందే పారితోషికం మాట్లాడుకుని ఉంటే కొంత తగ్గి ఉండేది అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వివరణ ఇచ్చాడు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus