Kalyan Ram, Jr NTR: ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ కు విభేదాలంటూ ప్రచారం.. అసలు నిజాలివే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంత క్లోజ్ గా ఉంటారో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో సక్సెస్ సాధించడం కోసం జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య గ్యాప్ వచ్చిందని డెవిల్ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందించలేదని, డెవిల్ ఈవెంట్ కు తారక్ హాజరు కావడం లేదని వేర్వేరు వార్తలు వినిపించాయి.

అయితే డెవిల్ ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ వైరల్ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవర గురించి తమ్ముడు, కొరటాల శివ సరిగ్గా మాట్లాడగలరని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నాతో పాటు తమ్ముడికి కూడా సొంత బ్యానర్ అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. నందమూరి హరి నిర్మాణ బాధ్యతలను చూసుకుంటారని బింబిసార బడ్జెట్ ఎంతో ఇప్పటికీ నాకు తెలియదని ఆయన కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కు క్లారిటీ ఉందని తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కళ్యాణ్ రామ్ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక్క సినిమాకు ట్వీట్ చేశారని తారక్ కు నచ్చితే ట్వీట్ వేస్తారని మా ఇద్దరి మధ్య అబ్లిగేషన్స్ ఉండవని ఆయన పేర్కొన్నారు. డెవిల్ ట్రైలర్ బాగుందని తారక్ చెప్పారని ఒక చిన్న షాట్ మార్చాలని కోరారని కళ్యాణ్ రామ్ తెలిపారు. మేము ఎప్పటికీ విడిపోమని ఎవరూ విడదీయలేరని కళ్యాణ్ రామ్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

మేము జీవితాంతం అన్నాదమ్ములమని ఆయన అన్నారు. 8 నెలలు రీసెర్చ్ చేసి ప్రణాళికను సిద్ధం చేసుకుని దేవర షూట్ చేశామని కళ్యాణ్ రామ్ అన్నారు. ఓం సినిమా నాకు లర్నింగ్ లెసన్ అని ఆయన తెలిపారు. బింబిసార డైరెక్టర్ వశిష్టను మేము వదలలేదని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన వెళ్లిపోయారని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. నేను బయటికెళ్లి ఒక సినిమా చేసుకుంటానని వశిష్ట చెబితే నేను ఓకే అన్నానని ఆయన వెల్లడించారు. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus