అన్ స్టాపబుల్ కు తారక్, కళ్యాణ్ రామ్ అందుకే రాలేదట!

ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో సీజన్1, అన్ స్టాపబుల్ షో సీజన్2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సీజన్లలో చిరంజీవి, తారక్, కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. అన్ స్టాపబుల్ షోకు ఎందుకు హాజరు కాలేదని కొన్నిరోజుల క్రితం చిరంజీవిని అడగగా ఆ షో నుంచి తనకు ఆహ్వానం అందలేదని అందుకే హాజరు కాలేదని చిరంజీవి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ కూడా ఇదే సమాధానం ఇచ్చారు.

తాను, తారక్ అన్ స్టాపబుల్ కు ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్నకు ఈ ప్రశ్న ఆహా వాళ్లను అడగాలని కళ్యాణ్ రామ్ కామెంట్ చేశారు. అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఈ సమాధానం సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కామెంట్లపై ఆహా షో నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య అభిమానులు మాత్రం అన్ స్టాపబుల్ సీజన్3 కోసమే సీజన్1, సీజన్2 లకు పలువురు గెస్ట్ లను పిలవలేదని చెబుతున్నారు.

రామ్ చరణ్ కూడా ఈ షోకు హాజరు కావాల్సిన సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు. అన్ స్టాపబుల్ సీజన్3 కు సంబంధించి అప్ డేట్ ఇస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. బాలయ్య గెస్ట్ ల సెలెక్షన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వల్ల ఆహా నిర్వాహకులకు అంచనాలకు మించి లాభాలు వచ్చాయని సమాచారం.

సీజన్3 ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. ఇతర భాషల సెలబ్రిటీలు సైతం సీజన్3 లో కనిపించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆహా ఓటీటీకి బిగ్గెస్ట్ హిట్ గా అన్ స్టాపబుల్ షో నిలవగా ఇతర ఓటీటీలు సైతం ఈ తరహా టాక్ షోలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus