Kalyan Ram: బింబిసారతో కళ్యాణ్ రామ్ కల నెరవేరినట్టేనా?

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బింబిసార మూవీ ఫస్ట్ లుక్ విడుదలైన సమయంలో ఫస్ట్ లుక్ పోస్టర్ బాహుబలి సినిమాలా ఉందని మగధీర సినిమాలా ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ట్రోల్ చేసిన వాళ్లే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ను ప్రశంసిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ తన నటనతో మంచి మార్కులు వేయించుకోవడంతో పాటు కొత్త దర్శకునితో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. మరోవైపు చాలామంది హీరోలు కొత్త దర్శకుల డైరెక్షన్ లో పని చేయడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎంతో టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో గుర్తింపు దక్కని డైరెక్టర్ల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. అలాంటి డైరెక్టర్లకు కళ్యాణ్ రామ్ అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.

కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాల ద్వారా పరిచయమైన సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ట స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. బింబిసార సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో బింబిసార పార్ట్2 ను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నారు.

కళ్యాణ్ రామ్ బింబిసార సక్సెస్ తో మిడిల్ రేంజ్ హీరోలలో టాప్ రేంజ్ కు ఎదగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బింబిసార సక్సెస్ తో కళ్యాణ్ రామ్ తో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. కళ్యాణ్ రామ్ బయటి నిర్మాతలతో సినిమాలు చేయడానికి ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus