Kalyan Ram: బింబిసార విషయంలో కళ్యాణ్ రామ్ తప్పు చేశారా?

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసార సినిమా అంచనాలకు మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కథ, కథనం అద్భుతంగా ఉండటం, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే బింబిసార పార్ట్1 విడుదలైన తర్వాత ప్రమోషన్స్ విషయంలో చిత్రయూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీతారామం, కార్తికేయ2 చిత్రయూనిట్లు తమ సినిమాలకు ప్రమోషన్స్ చేస్తూ కలెక్షన్లు మరింత పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే బింబిసార చిత్రయూనిట్ మాత్రం సినిమాను ప్రమోట్ చేయడంపై ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.

మరోవైపు బింబిసార సినిమాకు బుకింగ్స్ సైతం అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. సీతారామం సినిమా హిందీలో డబ్ అవుతుండగా బింబిసార సినిమా హిందీలో డబ్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. వీలైనంత త్వరగా బింబిసారను హిందీలో డబ్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఈ విధంగా చేసి ఉంటే సినిమాకు లాభాలు మరింత పెరిగేవి.

మరోవైపు బింబిసార2 సినిమా బింబిసారకు ప్రీక్వెల్ అని ఈ సినిమాలో లేడీ విలన్ గా స్టార్ హీరోయిన్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. బింబిసార2 సినిమాలో రాక్షసి పాత్ర ఉంటుందని ఆ పాత్రను దర్శకుడు వశిష్ట కొత్తగా డిజైన్ చేశారని తెలుస్తోంది. బింబిసార2 వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus