Kalyan Ram: ఎన్నికల్లో తారక్ ప్రమేయంపై మరోసారి కళ్యాణ్ రామ్ క్లారిటీ.. ఏమన్నారంటే?

2024 సంవత్సరంలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతుండటంతో వార్ వన్ సైడ్ కాదని ప్రతి చిన్న అంశం ఎన్నికలకు సంబంధించి కీలకం కానుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో పలు సందర్భాల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో తారక్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ కు 2024 ఎన్నికల్లో తారక్ లేదా మీ ప్రమేయం ఉంటుందా అనే ప్రశ్న ఎదురు కాగా

ఆ ప్రశ్న ఇప్పటికిప్పుడు అడిగితే లేదనే సమాధానం చెబుతానని ప్రస్తుతం మా మైండ్ అస్సలు పక్కకు వెళ్లే పరిస్థితి లేదని కళ్యాణ్ రామ్ అన్నారు. దేవర సినిమా గురించి ఎక్కువగా అడుగుతుండటంతో మాపై ఒత్తిడి పెరుగుతోందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. దేవర సినిమా విషయంలో ఉన్న ఏకాగ్రత ఎక్కడికీ ఎటూ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు.

రాజకీయాలలో ప్రస్తుతానికి జోక్యం చేసుకునే ఆలోచన లేదని (Kalyan Ram) కళ్యాణ్ రామ్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. దేవర మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా కళ్యాణ్ రామ్ సైతం ఈ సినిమా గురించి అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. డెవిల్ సినిమాతో యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలతో సైతం భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

నందమూరి హీరోలకు 2024 సంవత్సరం కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నందమూరి హీరోల సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయేమో చూడాల్సి ఉంది. నందమూరి హీరోలకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus