Kalyan Ram, Jr NTR: తారక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కళ్యాణ్ రామ్!

నందమూరి హీరోలైన కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కెరీర్ పరంగా మరింత ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా పలు సినిమాలతో విజయాలను అందుకున్నారు.

బింబిసార సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కళ్యాణ్ రామ్ తన వంతు కృషి చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్యతో సినిమా నిర్మించాలని ఉందని అయితే బాబాయ్ కు ఒక కథ చెప్పగా ఆ కథ బాబాయ్ కు నచ్చలేదని కళ్యాణ్ రామ్ అన్నారు. మంచి కథ దొరికితే బాబాయ్ తో సినిమాను నిర్మించడానికి సిద్ధమేనని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ భాగస్వామా అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందిస్తూ

మేమంతా ఒక కుటుంబం అని నాకు తారక్ కు మధ్య లెక్కలు ఉండవని కామెంట్లు చేశారు. బింబిసార సినిమాలో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయే తప్ప యుద్ధాలు ఉండవని కళ్యాణ్ రామ్ అన్నారు. భ్రమరాంబ థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి బింబిసార సినిమాను చూస్తానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ ను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ సంఖ్యలో థియేటర్లు దక్కాయి. ఈ సినిమాకు 16 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని బోగట్టా. బడ్జెట్ బిజినెస్ పరంగా కళ్యాణ్ రామ్ కు లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. 5 కోట్ల రూపాయల టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోందని సమాచారం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus