ఎన్టీఆర్ కి ఓ స్క్రిప్ట్ నచ్చిందట కానీ, జనతా గ్యారేజ్ సక్సెస్ ని కొనసాగించడానికి, అంతకుమించిన సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న ఎన్టీఆర్ నచ్చిన స్క్రిప్ట్ ను కూడా పక్కకు పెట్టాడు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ తో సినిమా చేస్తే ప్రయోగం చేసినట్లు అవుతుందని, ఆ ప్రయోగం బెడిసికొడితే….చాలా సమస్య వస్తుందని అనుకుంటున్నాడట ఎన్టీఆర్.
అందుకే ఆ సినిమాకి ఓకే చెప్పలేదట. అలా ఎన్టీఆర్ నో చెప్పిన స్క్రిప్ట్ కి కళ్యాణ్ రామ్ ఓకే చేశాడని సమాచారం. పటాస్, సుప్రీమ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఆమధ్య ఎన్టీఆర్ కి ఓ స్టొరీ లైన్ చెప్పాడు కథ నచ్చినప్పటికీ ఆ స్టొరీ లైన్ తో సినిమా చేయడం సేఫ్ కాదని భావించి రిజెక్ట్ చేశాడట.