Kalyan Ram wife Swathi: కళ్యాణ్ రామ్ భార్య డాక్టర్ అని మీకు తెలుసా?

నందమూరి కుటుంబంలో ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ తర్వాత అలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారు నటుడు కళ్యాణ్ రామ్. ఈయన నటన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. ఎన్టీఆర్ బాలకృష్ణ స్థాయిలో కాకుండా ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్ నటుడుగా నిర్మాతగా అందరికీ సుపరిచితమే కానీ తన భార్య పిల్లల గురించి మాత్రం చాలా మందికి తెలియదు.

అయితే ప్రస్తుతం ఈయన నటించిన బింబిసారా సినిమా ఈనెల 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కళ్యాణ్ రామ్ వ్యక్తిగత విషయాల గురించి ఆయన భార్య ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి ఓ లుక్ వేద్దాం..

కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి వీరిద్దరిది పెద్దలు కుదుర్చిన వివాహం.ఇక కళ్యాణ్ రామ్ పెళ్లిచూపులప్పుడే స్వాతి నచ్చడంతో తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మరి పెళ్లి చేసుకున్నారు. ఇక స్వాతి కూడా వృత్తిరీత్యా వైద్యురాలు.ఇక ఈమె మంచి సంపన్నుల కుటుంబం నుంచి నందమూరి ఇంటికి కోడలుగా అడుగు పెట్టింది తన తండ్రికి ఫార్మా కంపెనీలతోపాటు ఎన్నో బిజినెస్ లో ఉన్నాయి.

వృత్తిపరంగా వైద్యురాలు అయినటువంటి స్వాతి కళ్యాణ్ రామ్ వివాహం చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా తన వైద్య వృత్తిని పక్కనపెట్టి ఇంటి బాధ్యతలను చూసుకుంటూ బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం తన పిల్లలు పెద్ద కావడంతో కళ్యాణ్ రామ్ సహాయంతో ఆమె కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వీఎఫ్ఎక్స్ సమస్తను స్థాపించారు. ఇక ఈ దంపతులకు తారక అద్వైత , శౌర్యరామ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus