Kalyan Ram: ‘బింబిసార’కి సీక్వెల్.. మరోసారి కన్ఫర్మ్ చేసిన హీరో!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ నటించిన ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై చిత్రబృందం చాలా నమ్మకం పెట్టుకుంది. దానికి తగ్గట్లే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రీరిలీజ్ బజ్ వలన సినిమాకి మంచి బుకింగ్స్ జరగ్గా.. టాక్ బాగుండడంతో తొలిరోజు వసూళ్లు మరింత పుంజుకున్నాయి. హౌస్ ఫుల్ కలెక్షన్స్ దూసుకుపోతుంది ఈ సినిమా. తొలిరోజు సాయంత్రమే అదనపు థియేటర్లు, షోలు వేసేంత డిమాండ్ వచ్చిందంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

దీంతో తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు కళ్యాణ్ రామ్. ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇది ప్రజల విజయమని.. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే.. జనాలు థియేటర్లకి వస్తారని నిరూపించారని అన్నారు. ఈ విజయానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం మీకు రుణపడి ఉంటుందని.. మరోసారి మమ్మల్ని బ్రతికించారు అంటూ చెప్పుకొచ్చారు

కళ్యాణ్ రామ్. ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తామని అన్నారు. తనకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు వశిష్టకు కృతజ్ఞతలు చెప్పారు కళ్యాణ్ రామ్. ఇదే సమయంలో ‘బింబిసార’కి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. బింబిసారుడు అనే గొప్ప పాత్రను తను చేయగలనో లేదో అనే సందేహంలో ఉన్నప్పుడు తనపై ఎంతో నమ్మకం చూపించిన దర్శకుడు వశిష్టకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదని కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా మాట్లాడారు.

‘బింబిసార’ పార్ట్ 2ని ఎంతో బాధ్యతగా తెరకెక్కించాల్సిన బాధ్యతను వశిష్టకు అప్పగిస్తున్నట్లు.. మరో అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వస్తామని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus