2023 సంక్రాంతి బరిలో దిగుతున్న చిన్న సినిమా ‘కళ్యాణం కమనీయం’. మొదటి నుండి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనే వార్తలు వస్తుంటే.. ఇది హైప్ కోసం చేస్తున్నారేమో అని అంతా అనుకున్నారు. కానీ కాదు.. మేకర్స్ ధైర్యం చేసి మరీ ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపుతున్నారు. ఇటీవల విడుదలైన ‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను యూత్ ను టార్గెట్ చేసి ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు అని స్పష్టమవుతుంది.
కానీ ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ లాంటి క్రేజీ మాస్ సినిమాల ముందు ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా సంతోష్ శోభన్ కు ఒక ఓటీటీ హిట్ తప్ప.. థియేట్రికల్ సక్సెస్ లేదు. మొన్నీమధ్య వచ్చిన ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ పెద్ద ప్లాప్ అయ్యింది. అందులోనూ పెద్ద సినిమాలు ‘వీర సింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు కనుక చూసేస్తే ఆడియన్స్ కి ‘వారసుడు’ ‘తెగింపు’ వంటి డబ్బింగ్ సినిమాలు చూసే ఆప్షన్ ఉంది.
అలాంటప్పుడు ‘కళ్యాణం కమనీయం’ సినిమా జనాలకు గుర్తుండే ఛాన్స్ కూడా తక్కువ. అయితే ఈ సినిమా రన్ టైం వల్ల ఓ అడ్వాంటేజ్ ఉంది. ‘కళ్యాణం కమనీయం’ సినిమా రన్ టైం ఓన్లీ 106 నిమిషాలు మాత్రమే. అంటే ఒక గంట 46 నిమిషాలు.ఈ సినిమా రన్ టైం వల్ల మల్టీప్లెక్సుల్లో పెద్ద సినిమాల నడుము షోలు బాగానే పడతాయట.
అలాగే రూరల్ ఏరియాస్ లో ఉండే సింగిల్ స్క్రీన్స్ లో పెద్ద సినిమాలు 4 షోలు పడినా.. మధ్యలో ఉండే గ్యాప్ లో ఈ సినిమా 2 షోలు వేసుకునేలా థియేటర్ ఓనర్స్ తో మాట్లాడుకున్నారట ఈ సినిమా నిర్మాతలైన యూవీ వారు. సో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సరిపోతుంది. పండుగ టైంలో బాగా క్యాష్ చేసుకోవడానికి..!
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!