Kalyandev: కళ్యాణ్ దేవ్ విడాకుల విషయాన్ని ప్రకటించనున్నారా… ఆ పోస్టుకు అర్థం అదేనా?

కళ్యాణ్ దేవ్ పరిచయం అవసరం లేని పేరు.మెగా అల్లుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా శ్రీజను రెండవ వివాహం చేసుకున్నటువంటి కళ్యాణ్ దేవ్ మెగా అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే కొన్ని నెలలుగా మెగా కుటుంబానికి కళ్యాణ్ దేవ్ పూర్తిగా దూరమయ్యారని తెలుస్తోంది. శ్రీజ కళ్యాణ్ మద్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని

అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని అందరూ భావిస్తున్నారు.ఇక శ్రీజ కళ్యాణ్ దేవ్ కి జన్మించిన కూతురు నవిష్క మాత్రం తన తల్లిదండ్రుల ఇద్దరి దగ్గర ఉంటున్నారు. ఇలా వీరిద్దరూ దూరంగా ఉన్నప్పటికీ వీరి విడాకుల విషయాని మాత్రం గోప్యంగా ఉంచారు. శ్రీజ కళ్యాణ్ దేవ్ కి కూడా విడాకులు ఇచ్చారని, ఈమె త్వరలోనే మూడవ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీజ గురించి విడాకులు మూడో పెళ్లి అనే వార్తలు వచ్చినప్పటికీ మెగా కుటుంబం మాత్రం ఏ విధంగా స్పందించలేదు.

కళ్యాణ్ దేవ్ సైతం తన విడాకుల విషయాన్ని చెప్పకుండా ఒంటరిగా ఉంటూ తన స్నేహితులతో కలిసి వెకేషన్ లకు వెళ్తూ తన లైఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేస్తూ…

కొద్ది రోజులు ఓపికగా ఉంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అంటూ చెప్పుకొచ్చారు.ఇలా కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేయడంతో ఈయన త్వరలోనే విడాకుల గురించి చెప్పబోతున్నారా అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus