‘మా ఊరి పొలిమేర'(Maa Oori Polimera) అనే సినిమా 2021 ఎండింగ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత పాజిటివ్ రివ్యూస్ రావడంతో… ఎగబడి చూశారు. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు మంచి కిక్ ఇస్తాయి. దీనికి వచ్చిన ఆదరణ మేకర్స్ కి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే 2వ భాగాన్ని థియేట్రికల్ రిలీజ్ చేశారు.
ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దాదాపు రూ.20 కోట్ల వరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఇప్పుడు పార్ట్ 3 కూడా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. పొలిమేర మొదటి భాగంలో ఇంటి*మేట్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, హీరో సత్యం రాజేష్ కి మధ్య ఓ డీప్ ఇంటి*మేట్ సీన్ ఉంటుంది. దాని గురించి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఆ సీన్ కావాలని చేసింది కాదు అంటుంది హీరోయిన్ కామాక్షి భాస్కర్ల.

కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) మాట్లాడుతూ.. ” ‘పొలిమేర’లో(మొదటి భాగం) ఉన్న ఇంటి*మేట్ సీన్ ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదు. కథలో భాగంగా ఆ సన్నివేశం వస్తుంది. కథకి ఆ సీన్ అవసరం. కానీ దానికి మా ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా ఉండటం వల్ల.. సరైన విధంగా కన్వే అవ్వలేదు అని నా అభిప్రాయం. మా దగ్గర సరైన బడ్జెట్ ఉంటే.. అది రైట్-ఫుల్ గా వెళ్ళేదేమో. సెకండాఫ్ లో కూడా కొమురయ్య ఉండే నియమాల గురించి తెలుపుతూ.. దీని గురించి ప్రస్తావన ఉంటుంది.
సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది కథకు అవసరం అని” అంటూ చెప్పుకొచ్చారు.
