కూతురు మతం మార్చుకోవడంపై కమల హాసన్ ట్వీట్!
- July 29, 2017 / 07:49 AM ISTByFilmy Focus
విశ్వనటుడు కమల హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ తో పాటు చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా సూపర్ ట్యాలెంటెడ్. బాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేసిన అక్షర షమితాబ్ చిత్రం ద్వారా నటిగా అవతారమెత్తింది. తాజాగా స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. నటిగా కొనసాగుతూనే తన కుటుంబ సభ్యులతో ఒక సినిమాని డైరక్ట్ చేయాలనీ కలలు కంటోంది. అయితే ఈ మధ్య బౌద్దమతం స్వీకరించింది. దేవుడిపై నమ్మకం లేదంటూనే మతం మారడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ విషయంపై కమల్ హాసన్ స్పందించారు.
‘హాయ్ అక్షు. నువ్వు మతం మార్చుకున్నావా? నువ్వు మతం మారినా సరే నాకు నువ్వంటే ఇష్టమే. మతంతో సంబంధంలేని ప్రేమ నిస్వార్ధమైనదని నేను నమ్ముతాను. నీ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయ్. ప్రేమతో మీ బాపు (నాన్న)'” అంటూ ట్వీట్ చేశారు. కమల్ హాసన్ తన కూతుళ్లకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటారనడానికి ఇది ఉదాహరణ మాత్రమే
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












