Kamal Haasan: బిగ్ బాస్ షో సీజన్7 కోసం కమల్ హాసన్ ఆ రేంజ్ లో తీసుకుంటున్నారా?

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కిందనే సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమల్ హాసన్ ఇమేజ్ ను మార్చేసిందని చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ షో సీజన్7 కోసం కమల్ హాసన్ ఏకంగా 130 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఒక విధంగా ఈ రెమ్యునరేషన్ రికార్డ్ అనే చెప్పాలి.

ఒక టీవీ షో కోసం 130 కోట్ల రూపాయలు తీసుకోవడం సౌత్ ఇండియాలో కమల్ హాసన్ విషయంలోనే జరుగుతోందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ రేంజ్, మార్కెట్ కు ఇంతకు మించి సాక్ష్యం అవసరం లేదని కమల్ తన పాపులారిటీతో ఈ స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజెక్ట్ కే సినిమా కోసం (Kamal Haasan) కమల్ భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారని కమల్ ఎంట్రీతో ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ తన సినిమాలకు తీసుకునే మొత్తం కంటే ఈ పారితోషికం ఎక్కువని తెలుస్తోంది. కమల్ హాసన్ కు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాకు అంచనాలకు మించి బిజినెస్ జరగనుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి2 రికార్డులను ఈ సినిమా సునాయాసంగా బ్రేక్ చేయగలదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్ట్ కే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రాజెక్ట్ కే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రభాస్, కమల్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ షేక్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో రాజమౌళి స్థాయికి ఎదుగుతాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus