కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి కమల్ హాసన్ శనివారం చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎందరికో స్ఫూర్తి నింపే వ్యాఖ్యలు చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ తాను ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని భావించానని వెల్లడించారు. తనకు 20 -21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదు.
ఇలా అవకాశాలు రాకపోవడంతో తాను ఎంతో డిప్రెషన్ కి గురయ్యాను దీంతో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా తనలో కలిగాయని కమల్ హాసన్ తెలిపారు. అయితే ఇదే విషయం గురించి నా గురువుగారు అనంతుకు కూడా చెప్పటంతో ఆయన నాతో ఒకటే మాట చెప్పారు. గుర్తింపు లేదని అవకాశాలు లేవని బాధపడకూడదు నీ పని నువ్వు చేసుకుంటూ పో సమయం వచ్చినప్పుడు దానంతట అదే నీకు గుర్తింపు లభిస్తుందని నాకు సలహా ఇచ్చారు
ఆయన మాటలు విన్నటువంటి నాకు నేను ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదు ఇది సరైన నిర్ణయం కాదు అని ఆలోచించి ఈ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. హత్య చేయడం ఎంత నేరమో ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే నేరమని కమల్ హాసన్ వెల్లడించారు. మన జీవితంలో చీకటి అనేది ఎప్పుడు అలాగే ఉండిపోదు ఏదో ఒక సమయంలో వెలుగు అనేది తప్పకుండా వస్తుంది.
మన జీవితంలో చావు అనేది ఒక భాగం కానీ మనం చావు కోసం ఎదురుచూస్తూ కూర్చోకూడదని మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలని మనం కన్న కలలను సాకారం చేసుకోవాలి అంటూ ఈ సందర్భంగా కమల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రతి ఒక్కరికి చాలా స్ఫూర్తిగా నిలిచాయని చెప్పాలి.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!