జనవరి నుండి సెట్స్ పైకి కమల్, శంకర్!
- December 11, 2020 / 04:29 PM ISTByFilmy Focus
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. సెట్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించడం, నిర్మాతలతో దర్శకుడు విబేధాలు ఏర్పడడం ఇలా పలు కారణాల వలన సినిమాకి అవరోధాలు ఏర్పడ్డాయి. బడ్జెట్ సమస్యలతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అసలు ఈ సినిమా మళ్లీ మొదలవుతుందా..? అనే సందేహాలు కలిగాయి. లాక్ డౌన్ తరువాత షూటింగ్ మొదలవుతుందని భావించా.. కమల్ హాసన్ మాత్రం ఈ సినిమాని పక్కన పెట్టి ‘విక్రమ్’పై దృష్టి పెట్టాడు.
దీంతో ‘ఇండియన్ 2’ ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు గొడవలు సద్దుమణిగినట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. శంకర్ ఇప్పటికే షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం. జనవరిలోగా ‘విక్రమ్’ సినిమాను పూర్తి చేయాలని కమల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ‘ఇండియన్ 2’ సినిమా మళ్లీ మొదలుకానుందని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం.

అనుకున్న బడ్జెట్ లో సినిమాను పూర్తి చేస్తానని శంకర్ నిర్మాతలకు హామీ ఇచ్చాడని.. కమల్ కూడా కీలకమైన సమయంలో శంకర్ కి మద్దతుగా నిలిచాడని తెలుస్తోంది. అందుకే బడ్జెట్ గొడవలు ఓ కొలిక్కి వచ్చాయట. త్వరలోనే తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో కమల్ పాల్గొనున్నారు. రాజకీయ పరంగా ఈ సినిమా తనకు కలిసి రావాలని కమల్ భావిస్తున్నాడు. అందుకే ఎన్ని ఆటంకాలు వస్తున్నా.. ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!












