Krishna Statue :కమల్ చేతుల మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎన్నో గొప్ప సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉందని చెప్పాలి. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గత ఏడాది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కృష్ణ మరణం తర్వాత ఆయన విగ్రహాలను పలుచోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెజవాడలో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఈయన విజయవాడ వచ్చారు. ఇలా విజయవాడలో సందడి చేసినటువంటి కమల్ హాసన్ చేతుల మీద కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు.

ఈ విధంగా కృష్ణ గారి విగ్రహవిష్కరణ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన వెంటనే కమల్ హాసన్ కూడా ఇందుకు ఒప్పుకున్నారు. తాజాగా నేడు ఉదయం కృష్ణ గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ తో పాటు నేత దేవినేని అవినాష్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మరొక సూపర్ స్టార్ కమల్ హాసన్ ఆవిష్కరించడం విశేషం.

ఈ క్రమంలోనే (Krishna) కృష్ణ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కృష్ణ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక విజయవాడలోనే గురునానక్ కాలనీలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus