Kamal Haasan: ‘విక్రమ్’.. పాన్ ఇండియా లెవెల్ లో జోరు చూపిస్తాడా..?

ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. ‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేస్తున్నారని భావించారంతా. కానీ ఆ సినిమా నార్త్, సౌత్ అనే తేడా లేకుండా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ సినిమాలు అంచనాలను మించి పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ ను సాధించాయి. ఈ మూడు సినిమాల ధాటికి బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది.

‘కేజీఎఫ్2’ విడుదలైన మూడు వారాలకు కూడా జోరు తగ్గించకుండా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కొంచెం గ్యాప్ లో మరో సౌత్ సినిమా దేశవ్యాప్తంగా సత్తా చాటితే ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ పండితులు. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా మీద వారికి బాగానే గురి కుదిరినట్లు సమాచారం. ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్.. కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ల సంచలన కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేయడంతోనే ‘విక్రమ్’ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.

గత దశాబ్ద కాలంలో కమల్ చాలా వరకు సినిమాల్లో డల్ గా ఉంటున్నారు. చేసిన సినిమాలు తక్కువ.. పైగా అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఆయన చాలా గ్యాప్ తరువాత ‘విక్రమ్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటించారు. అందులో విజయ్ సేతుపతి, ఫహద్ లాంటి నటులు ఉండడంతో ఈ సినిమాపై బజ్ పెరిగిపోయింది.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ సినిమా పబ్లిసిటీ మొదలుపెట్టలేదు. ఈ నెల 15న ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ గనుక ఆకట్టుకుంటే పబ్లిసిటీ హోరెత్తించడం ఖాయం. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus