Kamal Haasan: శంకర్‌ – కమల్‌ మీద నమ్మకమే కానీ.. మరీ అంత తేడా అంటే?

కమల్‌ హాసన్‌ ఏం చేసినా చూడాలనిపిస్తుంది… డైరక్టర్‌ శంకర్‌ ఏం చూపించినా అదిరింది అనాలని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ సినిమా గురించి ఇద్దరూ కలసి చేస్తున్నారన్న ఓ ప్రయత్నం వింటే ఓవైపు ఆనందం, ఆశ్చర్యం కలుగుతున్నా.. అంతా ఓకేనా? ఫర్వాలేదా? అనే భయం కూడా కలుగుతోంది. అంత పెద్ద ప్రయోగం ఏం చేస్తారు అనేదేగా మీ డౌట్‌. శంకర్‌ చేయబోతున్న కొత్త ప్రయత్నం కమల్‌ లుక్‌ గురించి.

కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఇండియన్‌ 2’ అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఆసక్తికర రూమర్ ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్‌ ఎగ్జైట్‌ అవుతూనే, భయపడుతున్నారు. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ యంగ్‌ క్యారెక్టర్‌ కూడా ఉంటుందట. దీని కోసం కమల్‌ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు అని అంటున్నారు. అందులో భయం ఏముంది అనేగా మీ డౌట్‌.

ప్రస్తుతం కమల్‌ (Kamal Haasan) వయసు 68. ఈ సమయంలో 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించాలంటే అంత సులభం కాదు. దీని కోసం చాలా శ్రమించాలి. మేకప్‌తో, గ్రాఫిక్స్‌తో మాయ చేయొచ్చు. అయితే నేచురల్‌గా కనిపించాలి అంటే మాత్రం భయపడాల్సిందే అంటున్నారు. అయితే శంకర్‌ – కమల్‌ ఏదైనా చేయగలరు అనే విషయం మాత్రం మరచిపోకూడదు. కానీ శంకర్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఒక్కోసారి సినిమాకు భారం అవుతుంటాయి. అదే ఇక్కడ భయం. సినిమాలో నార్త్ నుండి వచ్చి దేశాన్ని ఏలుతున్న నాయకులు సౌత్ ఇండియాపై, ప్రజలపై చిన్నచూపు చూస్తున్నట్లు చూపిస్తున్నారని ఓ టాక్‌ నడుస్తోంది.

ఒకవేళ ఇదే జరిగితే ఈ సినిమాకు పాన్‌ ఇండియా రిలీజ్‌, ఆదరణ కష్టమే అని అంటున్నారు. కానీ సౌత్‌లో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటుందని చెప్పొచ్చు. అయితే మరి భారతీయ జనతా పార్టీ, ఉత్తరాది పార్టీలు ప్రస్తుతం ఎలా స్పందిస్తాయనేది చూడాలి. కమల్‌లో ఓ రాజకీయ నాయకుడు ఉన్న నేపథ్యంలో ఈ కథ ఇబ్బందికరమే అని చెప్పొచ్చు. క్లిక్‌ అయితే కమల్‌కు పొలిటికల్‌గా ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus