Kamal Haasan: కమల్ హాసన్ గ్రేట్ యాక్టర్ అంటున్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమాతో సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ ఇండియన్2 (Bharateeyudu 2) సినిమాతో నిరాశపరిచారు. జయాపజయాలకు అతీతంగా కమల్ హాసన్ కెరీర్ ను కొనసాగిస్తుండగా కమల్ హాసన్ ఒక వీడియోలో 27 ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం గమనార్హం. కమల్ వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన 27 ఎక్స్ ప్రెషన్లను ఒక వీడియోలో జత చేశారు.

ఒక అధ్యయనం ప్రకారం మనిషి 27 రకాల విభిన్న భావోద్వేగాలను పలికించడం సాధ్యమవుతుంది. కమల్ సైతం తన సినిమాలలో ఈ 27 రకాల విభిన్న భావోద్వేగాలను పలికించారు. నవరసాలను అద్భుతంగా పలికించి మెప్పించిన కమల్ ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ నుంచి యంగ్ జనరేషన్ నటులు ఎంతో నేర్చుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కమల్ హాసన్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు. సరైన కథలను ఎంచుకుంటే కమల్ హాసన్ సినిమాలు భారీ హిట్లుగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇండియన్2 సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాని నేపథ్యంలో ఇండియన్3 సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ జరుగుతోంది. కమల్ హాసన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.

కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ కమల్ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు. కల్కి సీక్వెల్ కోసం కమల్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. ఈ ఏడాదే కల్కి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus