Kamal Haasan: మోడల్స్ తో కమల్ హాసన్ పోజులు!

సినిమాల పరంగా కమల్ హాసన్ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లేనని అందరూ అనుకున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆయన నటించిన సినిమాలేవీ సరిగ్గా ఆడలేదు. ఆ తరువాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. దీంతో ఇక ఆయన సినిమాలు చేయరని అందరూ భావించారు. కానీ కమల్ రాజకీయాల్లో రాణించలేకపోయారు. దీంతో తిరిగి సినిమాలపై ఫోక్స్ చేశారు. ఈ క్రమంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటించారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

ఈ సినిమా సక్సెస్ తో కమల్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో కమల్ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే శంకర్ తో ‘ఇండియన్2’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. అలానే మణిరత్నంతో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇదెప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ఇదే సమయంలో కమల్ ఒక బిజినెస్ మొదలుపెట్టారు. చాలా నెలల క్రితమే ఆయన వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు న్యూస్ బయటకొచ్చింది.

కమల్ హాసన్ హౌస్ ఆఫ్ ఖద్దర్ పేరుతో బట్టల దుకాణాల చైన్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఖద్దర్ అని పేరుంది కానీ ఇదేమీ పాతకాలం ఖద్దర్ బిజినెస్ కాదు. ట్రెండీగా ఉండే ఖద్దరు దుస్తులతోనే వ్యాపారం మొదలైంది. ఈ బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా కమల్ హాసనే. దీనికోసం తాజాగా ఆయనొక ట్రెండీ ఫొటోషూట్ చేశారు. కొంతమంది యంగ్ మోడల్స్ తో కలిసి హుషారుగా ఫొటోషూట్ లో పాల్గొన్నారు.

ఈ ఫొటోలను ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ వయసులో కమల్ అంత హుషారుగా కనిపించడంతో ఫ్యాన్స్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఆయన ఇలాంటి మరిన్ని ఫొటోషూట్స్ చేసే ఛాన్స్ ఉంది.

1

2

3

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus