Vikram Movie: ‘విక్రమ్‌’ పవర్‌ఫుల్‌ మేకింగ్‌ వీడియో షేర్‌ చేసిన చిత్రబృందం!

స్టార్స్‌, గన్స్‌, ఫైర్‌, రివేంజ్‌, యాక్షన్‌… ‘విక్రమ్‌’ సినిమాను ఐదు పదాల్లో చెప్పాలంటే వీటినే చెప్పొచ్చు. కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాను థియేటర్లలో మిస్‌ అయినవారు ఇప్పుడు ఓటీటీలో చూసి అదిరిపోయింది అంటున్నారు. అంతకుముందు థియేటర్లలో కూడా ఇదే మాట అన్నారు అనుకోండి. ఓటీటీ మజాను ఆస్వాదిస్తున్న ప్రేక్షకుల కోసం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ మరో స్పెషల్ వీడియోను షేర్‌ చేసింది. అదే మేకింగ్‌ వీడియో.

సినిమా చూసిన వాళ్లకు కథ, కథనం, నేపథ్యంతోపాటు నైట్‌ సీన్స్‌ గురించి తెలుసు. సినిమాలో ఆ సీన్స్‌ చాలా కీలకం. అలాగే గన్స్‌, బ్లాస్ట్‌లు కూడా అదుర్స్‌ అనిపిస్తున్నాయి. ఇప్పుడు మేకింగ్‌ వీడియోలో కూడా ఆ సీన్స్‌నే ఎక్కువగా చూపించారు. దాంతోపాటు సినిమాలోని ప్రముఖ పాత్రలు కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ పాత్రలకు తగ్గట్టుగా మారడం కనిపిస్తుంది. అలాగే సినిమా ఆఖరున వచ్చి రప్ఫాడించిన రోలెక్స్‌ సర్‌ని కూడా చూపించారు.

సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. కమల్‌ హాసన్‌ లుక్, డ్రెస్సింగ్‌ స్టైల్‌‌ విషయంలో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తీసుకున్న జాగ్రత్తలను ఈ వీడియోలో మనం చూడొచ్చు. యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు కమల్‌ లుక్‌కు లోకేశ్‌ తుది మెరుగులు దిద్దుతూ కనిపించాడు. అలాగే గన్స్‌ను హ్యాండిల్‌ చేయడం లాంటివి కూడా చూపించాడు. ఈ వీడియోలో స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ అన్బు, అరివును కూడా చూడొచ్చు.

యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించే క్రమంలో వాళ్లు ఎలాంటి వర్క్‌ చేశారు అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలైంది. దీనికి రెండో పార్ట్‌ కూడా ఉంటుంది అని చెప్పేశారు. మరి అందులో ఏం చూపిస్తారు అనేది చూడాలి. అలాగే లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ గురించి ఈ సినిమా చూస్తే ఐడియా వస్తుంది. ఎందుకంటే అతని తర్వాతి సినిమాలో దాని కిందకే వస్తాయి కాబట్టి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!


టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus