‘ఆనంద్’, ‘గోదావరి’ లాంటి క్లాసిక్స్‌తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి కమలినీ ముఖర్జీ, తాను టాలీవుడ్‌కు ఎందుకు దూరమైందో ఎట్టకేలకు ఓపెన్ అయింది. ఆమె సంచలన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన స్టార్ హీరో సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’లో తన పాత్రను చూపించిన తీరు తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఆమె చెప్పింది.
“ఆ సినిమాలో నా పాత్ర చివరికి రూపుదిద్దుకున్న తీరు చూసి చాలా బాధపడ్డాను. దాని తర్వాత తెలుగు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. సెట్‌లో డైరెక్టర్, కో-స్టార్స్‌తో ఎలాంటి గొడవలు లేవని, అందరూ బాగానే చూసుకున్నారని ఆమె స్పష్టం చేసింది. కానీ, షూట్ చేసిన సన్నివేశాలను ఫైనల్ ఎడిటింగ్‌లో తీసేయడంతో తన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోయిందని, ఈ విషయాన్ని తాను వ్యక్తిగతంగా తీసుకున్నానని తెలిపింది.
టాలీవుడ్‌కు దూరమైన తర్వాత ఆమె ‘పులి మురుగన్’ (మలయాళం), ‘ఇరైవి’ (తమిళం) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా ఏళ్ల తర్వాత కమలినీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొక ఏడాది గడిస్తే ఆమె సినిమాలకు దూరమై పదేళ్లు అవుతుంది. మరి టాలీవుడ్ లో కాకపోయినా ఇతర ఇండస్ట్రీల ద్వారానైనా సినిమాల్లో కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.