Anand Movie: అసలైన రూప ఆమె..’ఆనంద్’ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

శేఖర్ కమ్ముల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంది ‘ఆనంద్’ సినిమాతో..! అంతకు ముందు అతను ‘డాలర్ డ్రీమ్స్’ అనే సినిమా చేసినప్పటికీ.. అది వచ్చి వెళ్లినట్టు చాలా మందికి తెలీదు. అయితే ‘ఆనంద్’ సినిమా చిరంజీవి ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ పక్కన రిలీజ్ అయినప్పటికీ సూపర్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. రాజా, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన ఈ సినిమా క్యాప్షన్ కి తగ్గట్టు మంచి ‘కాఫీ లాంటి సినిమా’ అనే చెప్పాలి.

Anand Movie

ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కమలినీ ముఖర్జీ. ‘ఆనంద్’ లో రూప అనే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిగా చాలా బాగా నటించింది. ఇదిలా ఉండగా… ‘ఆనంద్’ సినిమాకి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ కమలినీ ముఖర్జీ కాదట. మరో స్టార్ హీరోయిన్ కి దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కథ వినిపించాడట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో కమలినీ ముఖర్జీని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఆమె మరెవరో కాదు సదా. అవును.. ‘జయం’ సినిమాతో సదా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘నాగ’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశం పొందింది. దీంతో శేఖర్ కమ్ముల సదాని దృష్టిలో పెట్టుకునే కమలినీ ముఖర్జీ పాత్రని డిజైన్ చేసుకున్నాడట. కానీ సదా అప్పటికి బోలెడన్ని ఆఫర్స్ తో బిజీగా ఉండటం.. అలాగే శేఖర్ కమ్ముల కూడా కొత్త దర్శకుడు అనే కారణంతో ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఆ తర్వాత కోల్ కతాకు చెందిన కమలినీ ముఖర్జీని హీరోయిన్ గా ఎంపిక చేసుకుని సినిమా తీశాడు కమ్ముల. ఈ ఒక్క సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకవేళ సదా కనుక ‘ఆనంద్’ లో చేసి ఉంటే.. ఆమె ఖాతాలో మరో హిట్ పడేదేమో. కానీ కమలినీ ముఖర్జీ చేయడం వల్ల.. టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికినట్టు అయ్యింది.

ఐశ్వర్య రాయ్ రేంజ్ అందం, స్టార్ డమ్.. కానీ ఇప్పుడు అన్నీ వదిలేసి సన్యాసిగా మారిపోయింది!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus