Kangana Ranaut: లాకప్‌లో 16 మంది పెట్టి కంగన ఏం చూపించబోతోంది!

సగటు టీవీ సీరియళ్లు, టీవీ షోలకు దూరంగా ఉండే ఏక్తా కపూర్ అండ్‌ టీమ్‌ మరో ప్రయోగానికి సిద్ధమైంది. దీనికి తన స్నేహితురాలైన కంగన రనౌత్‌ను కూడా తోడు తెచ్చుకుంటోంది. భవిష్యత్తు సాంకేతిక ప్రపంచం అని చెబుతున్న మెటావర్స్‌తో ఓ షోను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన పేరు, లుక్‌, లోగో, వీడియోను ఏక్తా టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఓటీటీలు ఆల్ట్‌ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్‌ వేదికగాగా ఈ షో ప్రసారమవుతుంది.

Click Here To Watch

దీనికి సంబంధించి టీమ్‌ పూర్తిగా సమాచారం ఇవ్వకపోయినా బేసిక్‌ ఇన్ఫో అయితే అందుబాటులోకి వచ్చింది. వాటి ప్రకారం చూస్తే… ఈ షో ‘బిగ్‌బాస్‌’కి గట్టి పోటీ అంటున్నారు. ఏక్తా కపూర్‌ – కంగనా రనౌత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ షో పేరు ‘లాక్‌ అప్‌’. ఇందులో మొత్తం 16 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఉంటారట. లాకప్‌ ప్రోగ్రామ్‌ని బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఇన్‌డైరెక్ట్‌గా పోల్చింది కంగన. మా షో మీ పెద్దన్న ఇల్లు లాంటిది కాదు. ఇది నా జైలు అని చెప్పింది.

72 రోజుల పాటు 16 కంటెస్టెంట్‌లు కనీస అవసరాల కోసం కఠోరంగా శ్రమించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. లాక్‌ అప్‌లో పార్టిసిపేట్ చేయబోయే వాళ్ల 16మంది సీక్రెట్‌లు తమ దగ్గరుంటాయని కూడా చెప్పింది. ఎలాంటి ఎమోషన్స్‌, సెంటిమెంట్లు లేకుండా రియల్‌గా, పద్ధతిగా ఉండాలి అని చెప్పింది కంగన. అయితే షోలొ సెలబ్రిటీలు ఎవరెవరు ఉంటారు. ప్రైజ్‌ మనీ సంగతి, టాస్క్‌లు విషయం లాంటివి చెప్పలేదు కంగన. అయితే ఈ షో తొలి మెటా వెర్స్‌ షో అని టీమ్‌ చెబుతోంది రిలీజ్‌ చేసిన టీజర్‌ వీడియోలో కూడా మెటావెర్స్‌ బొమ్మల్లా కనిపిస్తున్నాయి.

దానికి తోడు ఫాంటసీ గేమ్‌ అని కూడా అంటున్నారు. దీంతో అసలు ఇది నార్మల్‌ రియాలిటీ షోనా… లేక షో లాంటిదా? అనే అనుమానం కలుగుతోంది. కంగన లాంటి స్టార్‌ హీరోయిన్‌ను తీసుకొని… బొమ్మల షో చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఒరిజినల్‌ షోనే అనుకోవాలి. అయితే బిగ్‌బాస్‌ లాంటి పెద్ద షోకి పోటీగా షో చేసి ఎంతమేర రాణిస్తారో చూడాలి. ఏక్తా – కంగన కలిస్తే సాధించలేదని లేదు అని అంటుంటారు కూడా. చూద్దాం ఏమవుతుందో.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus