Kangana Ranaut: స్టార్ కపుల్ పై కంగనా షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. తన మార్కెట్ ను రోజురోజుకి పెంచుకుంటుంది. ఈమె ట్విట్టర్ లో ఉన్నన్ని రోజులు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ పార్టీలపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె పోస్ట్ లు మరీ వివాదాస్పదంగా ఉండడంతో ట్విట్టర్ ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేసింది. కానీ రీసెంట్ గా ఆమె అకౌంట్ ను పునరుద్ధరించారు.

ఇక అప్పటినుంచి వివాదాలకు దూరంగా.. పాజిటివ్ ట్వీట్స్ వేస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది కంగనా. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాను తెగ పొగిడేసింది. అలానే సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు పెళ్లి చేసుకోబోతున్నారని వారి జోడీని కొనియాడింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తనను ఎవరో ఫాలో అవుతున్నారని.. తనపై స్పై చేస్తున్నారని కంగనా ఆరోపించింది. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నారని..

వీధుల్లోనే కాకుండా బిల్డింగ్ పార్కింగ్, ఇంటి టెర్రస్ లో కూడా తన కోసం జూమ్ లెన్స్ ఏర్పాటు చేశారని తెలిపింది. ఉదయం ఆరున్నర గంటలకు తన ఫొటోలు తీశారని.. వాళ్లకి తన షెడ్యూల్ ఎలా తెలుస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తన వాట్సాప్ డేటా, ప్రొఫెషనల్ కాంట్రాక్టులు, వ్యక్తిగత వివరాలు అన్నీ లీక్ అవుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ పోస్ట్ ఆమె స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ లను ఉద్దేశిస్తూ పెట్టిందని టాక్. పేరు పెట్టకుండా వారి గురించి పరోక్షంగా మాట్లాడింది కంగనా.

ఒకప్పుడు తన పర్మిషన్ లేకుండా ఇంటి దగ్గరకి వచ్చి బలవంతం చేశాడని.. ఇప్పుడు అతడి భార్యను నిర్మాతగా మార్చాలని చూస్తున్నాడని చెప్పింది. తన(కంగనా) మాదిరి మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని, తనలానే బట్టలు కూడా వేసుకోవాలని తన భార్యకి చెబుతున్నాడని వెల్లడించింది. ఆ జంట తన స్టైలిస్ట్, హోమ్ స్టైలిస్ట్ లను కూడా పనిలో పెట్టుకున్నారని తెలిపింది. ఫైనాన్షియర్లు, బిజినెస్ పార్టనర్స్ ఎలాంటి కారణం లేకుండా చివరి నిమిషంలో తనతో కాంట్రాక్టులు రద్దు చేసుకుంటున్నారని.. దీనంతటికీ ఆ జంటే కారణమని ఆరోపణలు చేసింది కంగనా.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus