Kangana Ranaut: కేసులపై వెరైటీగా మండిపడ్డ బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌!

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ను అందరూ ఫైర్‌ బ్రాండ్‌ అంటారు. ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ రాజకీయాల గురించి, నెపోటిజం గురించి ఇలా అన్ని విషయాలపై ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ప్రజల నుండి కూడా కాస్త స్పందన కనిపించేది. దీంతో కంగన మరింత విజృంభించి కనిపించిన ప్రతి విషయంపై స్పందిస్తూ వచ్చింది. దీంతో ప్రజల నుండి వ్యతిరేక స్పందన రావడం మొదలైంది. ఈ క్రమంలో ఆమె మీద కేసులు పెడుతున్నారు. తాజాగా సాగు చట్టాలు – రైతుల స్పందన గురించి కంగన స్పందించింది.

సాగు చట్టాల గురించి కంగన మాట్లాడుతూ… రైతుల ఉద్యమాన్ని ఖలిస్థాన్‌ ఉద్యమంతో పోల్చింది. ఈ మేరకు కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. దీంతో రైతులు, సిక్కులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరైతే ఆమె మీద కేసులు పెట్టారు. మహారాష్ట్రలో కూడా ఆమె మీద కేసులు నమోదయ్యాయి. దీంతో త్వరలో కంగననను అరెస్ట్‌ చేస్తారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి ఆ నోట ఈ నోట మారి… కంగన వరకు వెళ్లాయి. దీనిపై కంగన బోల్డ్‌గా స్పందించింది.

నా మీ మరో కేసు నమోదైందని తెలిసింది. ఒకవేళ నన్ను ఎవరైనా అరెస్టు చేయాలని వస్తే… నా మూడ్‌ ఇలా ఉంటుంది అంటూ ‘చేతిలో పానీయం గ్లాస్‌, ఒంటి మీద హాట్‌ డ్రెస్‌’ ఉన్న తన పాత ఫొటోను పోస్ట్ చేసింది కంగన. అంటే నన్ను అరెస్టు చేయాలనుకుంటే నేను పార్టీ చేసుకునే మూడ్‌లో ఉంటా అని చెప్పకనే చెప్పింది కంగన. దీనిపై మరోసారి నెటిజన్ల నుండి విమర్శలు వస్తున్నాయి. నీతులు చెప్పే కంగన… ఇలాంటి ఫొటోలతో ఏం చెప్పాలనుకుంటోంది అని అంటున్నారు. దీనిపై కంగన ఏమంటుందో చూడాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus