‘మేకపోతు గాంభీర్యం’ గురించి తెలుసా? ఇప్పటికే ఈ విషయం తెలిసి ఉంటే దానికి ఉదాహరణ ఇప్పుడు మేం చెప్పబోయే పేరు. ఒకవేళ ఆ మాటకు అర్థం తెలియకపోతే ఆమె మాటలు చూసి అర్థం చేసుకోవచ్చు. ఆమెనే కంగనా రనౌత్. ఇటీవల కంగన నుండి వచ్చిన ‘ధాకడ్’ సినిమా గురించే ఇదంతా. ఆ సినిమాకు భారీ లాస్ వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే కంగనా మాత్రం లాస్‌లు కవర్ అయిపోతున్నాయి, అయిపోయాయి అంటూ కవర్ చేస్తోంది.
‘ధాకడ్’ సినిమా థియేటర్ల దగ్గర దారుణ పరాజయం పాలైంది. సుమారు ₹85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా ₹ఐదు కోట్లు కూడా వసూలు చేయలేకోపయింది. ఒక్కో రోజు థియేటర్లలో ఒకరు కూడా రాని సందర్భాలూ ఉన్నాయట. వసూళ్లు, లెక్కలు చూస్తే బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పిన మాటలు అలానే ఉన్నాయి. అయితే కంగనా మాత్రం మీడియా చెబుతున్నట్లు అంత లాస్‌లు రాలేదు అని చెబుతోంది.
విషయమేంటంటే… ‘ధాకడ్’ పరాయజం పాలవడంతో ఆ సినిమా నిర్మాత దీపక్ ముకుత్ ఆఫీసు అమ్మేశారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటి గురించి ఆ మధ్య దీపక్ మాట్లాడుతూ మాట్లాడుతూ తమ సినిమాకు భారీ నష్టాలు ఏమీ రాలేదని, కొంత లాస్ ఉన్నప్పటికీ అది రికవరీ అవుతోందని చెప్పారు. జూలై 1న జీ 5 ‘ధాకడ్’ వచ్చింది. అలా డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి అమౌంటే వచ్చిందని చెబుతున్నారు. దీంతో కంగన బాలీవుడ్ మీడియా మీద ఫైర్ అయ్యింది.
‘‘నాపై అటాక్ చేసే దమ్ముంటే ముందుకు వచ్చి చేయండి. అంతేకానీ ఇలాంటి పుకార్లు వద్దు’’ అని ఘాటుగా స్పందించారు. ‘ధాకడ్’ ఫ్లాప్ అటూ వందల కొద్దీ ఆర్టికల్స్ చదువుతున్నాను. ‘83’, ‘గంగూబాయి కాఠియావాడి’, ‘రాధే శ్యామ్’, ‘జుగ్ జుగ్ జియో’ డిజాస్టర్స్ ఫలితాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?’’ అని కంగన ప్రశ్నించింది. మిగిలిన సినిమాల గురించి తనకు నచ్చినట్లు మాట్లాడే కంగనకు తన సినిమా గురించి మాట్లాడితే నచ్చదు.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!